స్నేహమేర జీవితం.. స్నేహమేర శాశ్వతం

Life with friendship.. Friendship is eternal– జీవితంలో కోట్లు సంపాదించినా కలగని ఆనందం ఒక మంచి స్నేహతుడు పొందినపుడు కలుగుతుంది
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అని, జీవితంలో కోట్లు సంపాదించిన కలగని ఆనందం ఒక మంచి స్నేహితుడిని పొందుతే కలుగుతుందని విశ్రాంత ఆచార్యులు సేర్ల దయానంద్ అన్నారు. తమ స్నేహం బందం 59 ఏళ్లనాటిది.  సేర్ల దయనంద్ విశ్రాంత ఆచార్యులు, గడ్డం దీరెందర్ రెడ్డి, నిజామాబాద్ వీరిరువురు మంచి స్నేహితులు  వీరు 6 వ తరగతి నుండి నిజామాబాద్ శ్రీ నూతన వైశ్య పాఠశాల – మాణిక్ భవన్లో హెచ్ ఎస్ సీ వరకు చదువుకున్నారు. తర్వాత బీకాం జి జి కాలేజిలో ఎం కాం ఇతర కాలేజిలో చదువుకున్నారు. వీరు రూమ్ మెట్స్ వారి స్నేహం కాలానికి అతీతమైనది. సేర్ల డయానంద్ జి జి కాలేజి, నిజామాబాద్ లో హెచ్ ఓ డి కామర్స్ గా పని చేసి రిటైర్ అయ్యారు. గడ్డం ధీరెందర్ రెడ్డి ఆంధ్రబ్యాంక్ వినాయక్ నగర్ లో మేనేజర్ గా పని చేసి రిటైర్ అయ్యారు. 59 ఏళ్ల స్నేహం చాల బాగుంది.  విభిన్నరంగాలలో ఉద్యోగాలు చేసిన వీరిది ఒకే మాట ఒకే బాట వీరిద్దరు ప్రస్తుతం విశాంత జీవితాన్ని నిజామాబాద్ లోనె గడుపుతున్నారు. అభిషాయాలు, ఆలోచనలు ఒకటే ప్రస్తుతం విశ్రాంత జీవితంలో వీరు పాత జ్ఞాపకాలను, మధుర స్మృతులను నెమరువేసుకుంటున్నారు . వీరిద్దరు కలసి సి సామాజిక సేవలను చేస్తుంటారు. భగవద్గీత  ప్రచారం చేయడం, భగవద్గీత ను ధ్యానం యోగ తరగతులు హాజరవుతారు. వాకింగ్ నిత్యం కలిసే చేస్తుంటారు. శబ్ద తరంగిణి సంస్థను ఏర్పాటు చేసి మొక్కలు నాటడం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇప్పటివరకు కలిసి ఉండడం ఆనందంగా ఉందని ఇరువురు మిత్రులు తెలుపుతున్నారు. తమ స్నేహంతో తమ జీవితకాలం పెరిగిందని తెలిపారు. స్నేహం ఎక్కువ కాలం ఉండాలంటే సర్దుకుపోయే స్వభావం ఉండాలన్నారు. ప్రతి ఒక్కరికి స్నేహితుల దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇద్దరు మిత్రులు కలుసుకొని పుస్తకాలను స్నేహానికి గుర్తుగా ఇచ్చిపుచ్చుకున్నారు.