నవ్వుల జాబిలి

ఎవరది? నవ్వుల జాబిలి నా ముందుకుహొనడిచివచ్చినట్లు,
అనుభూతికందని మహానందం సాక్షాత్కరించినట్లు,
నిన్న ఎద మైదానంపై ఆడుకున్న పసిమొగ్గ
నేడు తారుణ్య పుష్పమై ప్రత్యక్షమైనట్లుగా ఉంది.
కాదు .. కాదు.. ఆరిపోయిన కరుణాజ్యోతిహొ
మూడవరోజు ప్రకాశించినట్లుహొ
ముప్పయి ఐదేళ్ళ తరువాత మూర్తీభవించిన అనురాగం
మళ్లీ నా ముందుకు తరలివచ్చినట్లుగా ఉంది
పొలంలో చెమటకాలువై పారడం,
పొయ్యిలో కట్టెలా మండటం తప్ప మరేమీ తెలియని పిచ్చితల్లి
పండగ పూట తోడులేని దాపుడుచీర కట్టుకొనిహొ
పూరి గుడిసె ముందు నడయాడిన
మధుర జ్ఞాపకం నాదరి చేరినట్లుగా ఉంది
కాలం ఆత్మ బంధువులా నన్ను భుజాల మీద కూర్చో బెట్టుకొని
కన్నతల్లి ముందు నిలబెట్టినట్లుగా ఉంది
నా గుండెల్లో పోటెత్తిన దిగులు కడలికి వాత్సల్య వారధి కట్టి
తన పేగురాసిన ప్రేమకావ్యం లాంటిహొపెద్ద కొడుకును చూద్దామనిహొ
మనవరాలు రూపమెత్తిహొకోటి కనులతో అమ్మహొ
నా సమక్షంలో మెరిసినట్లుగా ఉంది.
తొలిసారి చీరగట్టుకొని చెంతకు చేరిన మా అమ్మాయిని
తడి చూపులతోహొకౌగిలించుకున్నపుడు
మనసుహొతోట నిండా మా అమ్మ వాసన..
– కోయి కోటేశ్వరరావు, 9440480274