
నవతెలంగాణ – కామారెడ్డి
బీడీ కార్మికులకు 2014సం కటాఫ్ తేదీని తొలగించి ఎలాంటి షరతులు లేకుండా రూ. 4016/- జీవన భృతి ఇవ్వాలని బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రం లో బీడీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బీడీ కార్మికులు భారీ,ర్యాలి నిర్వహించి కలెక్టరు కార్యాలయం దర్నా చౌక్ లో దర్నా నిర్వహించిన అనంతరం సంయుక్త కలెక్టర్, శ్రీనివాస్ రెడ్డి, పిడి, డిఆర్డిఓ పిడ, సురెంద్రర్ లకు వినతి పత్రాన్ని అందజేశారు.
కామారెడ్డి జిల్లా కేంద్రం లో సిఎస్ఐ చార్చి నుండి తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ, శ్రామిక శక్తి తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్, ఎ,ఐ, ఎప్ టీయూల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వరకు బీడీ కార్మికులు భారీ ర్యాలి, నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చౌక్ లో ధర్నా చేసి సంయుక్త కలెక్టర్, డిఆర్డిఏ పిడిలకు వినతిపత్రం అందించడంతో అధికారులు అనుకూలంగా స్పందించి, అందరికీ రూ. 4016/- జీవన భృతి ఇప్పించడానికి కృషి చేస్తామని హమీ ఇచ్చారు. అనంతరం బహుజన లెప్ట్ ట్రేడ్ యూనియన్, బీఎల్టీయూ, రాష్ట్ర అధ్యక్షులు, దండి వెంకట్, తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం, బిఎల్ టీయూ, రాష్ట్ర అధ్యక్షులు, యస్, సిద్దిరాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, నాగారపు యెల్లయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యం, ఆంజనేయులు, శ్రామిక శక్తి తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్, ఎఐఎప్ టీయూ, రాష్ట్ర అధ్యక్షురాలు, యస్, అనూసుయ, రాష్ట్ర నాయకులు, కుర్తి లింగం, రాష్ట్ర నాయకురాలు, వెంకట లక్ష్మి, తదితరులు కార్మికుల ను ఉద్దేశించి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రములోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10, నెలలు గడిచిన బీడీ కార్మికులకు ఇచ్చిన హామీ నేటికి అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలని గత నెల రోజులపాటు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మా రెండు యూనియన్ల ఆద్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కు స్దనిక ఎయం ఎల్ ఎ, మొద్దు నిద్ర లో ఉన్నారని, బీడీ కార్మికులు ఓట్లు తో అధికారి కణంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, బిజెపి యం,ఎల్ ఎ, అసెంబ్లీ లో బీడీ కార్మికుల జీవన భృతి విషయంలో మాట్లాడ కా పోవడం సిగ్గు చేటన్నారు. ఇప్పటికీ క్తెన నాయకులు మొద్దు నిద్ర విడనాడి, బీడీ పరిశ్రమ లో పని చేయు కార్మికులందరికి,ఎలాంటి షరతులు లేకుండా 4016,రూ,ల జీవన భృతి ఇవ్వాలని,2014,సంవత్సరం కటాఫ్ తేదీని తొలగించి, పరిశ్రమ లో పనిచేయు అందరికీ జీవన భృతి ఇవ్వాలని లేనిచో రానున్న స్దనిక ఎన్నికలలో వీరికి తగిన బుద్ధి చెప్పాలని కార్మికుల కు పిలుపు నిచ్చారు. బీడీ కార్మికులకు నేలకు 26,రోజు లు చేతి నిండా పని లేదన్నారు. నేలలో 10,రోజులు పనిలేదు, కేంద్ర ప్రభుత్వం బీడీ పరిశ్రమ ప్తె లేనిపోని ఆంక్షలు విధించింది, దినిపలింతగా బీడీ కార్మికులకు ఉన్న ఉపాది లేక వారి కుటుంబాలు అర్థ అకాలీ తో జీవిస్తున్నారన్నారు. బీడీ కార్మికుల పోరాటం తీవ్రం కాకముందే అందరికీ 4o16,జీవన భృతి అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిసెంబరు9,నుండి జరిగే అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోపు,బీడీ కార్మికులకు 2014,పిబ్రవరి కటాఫ్ తేదీని తొలగించి, ఎలాంటి షరతులు లేకుండా ప్రతి ఒక్కరికీ 4016,రూ,ల,జీవన భృతి ఇవ్వాలని, లేనిచో గ్రామంలో మండలం లో యం,ఎల్,ఎ,ను అధికార పార్టీ నాయకులను తిరుగానివ్వం అని,యం ఎల్,ఎ,ల ఇంటి ని ముఖ్య మంత్రి ప్రగతి భవనం ముట్టడి చేయడానికి క్తె బీడీ కార్మికులు సిద్దంగా ఉన్నారన్నారు.
ఈ కార్యక్రమం లో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యం, ఆంజనేయులు, రాష్ట్ర కోషదికారి, స్తెయ్యద్, రాష్డ, నా యకులు, శ్రీహరి, అజమ్ మ్తెముద్,,కుమ్మరి రవి, నాంపల్లి, గంగామణీ, అరుణ, బహుజన మహిళ సంఘం, కామారెడ్డి జిల్లా నాయకురాలు, లక్ష్మి, స్వప్న. బిడియస్ ఎఫ్, రాష్డ, అద్యక్షులు, వడ్ల సాయికృష్ణ, గంగాధర్, స్వామి, స్వాతి, మంగ, ఉదమ్, శ్రామిక శక్తి తెలంగాణ బీడీ కార్మిక సంఘం, ఎఐఎప్ టీయూ, రాష్ట్ర అధ్యక్షురాలు, యస్, అనూసుయ, రాష్ట్ర నాయకులు, కుర్తి లింగం, రాష్ట్ర నాయకురాలు, వెంకట లక్ష్మి తదితరులు బీడీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.