నవతెలంగాణ-చిలుకూరు
లక్ష లోపు రుణమాఫీని వెంటనే అమలు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జే.నరసింహారావు అన్నారు. గురువారం మండలంలోని బేతవోలు గ్రామంలో జరిగిన రైతు మండల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. 2018లో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు లక్షలోపు రుణమాఫీ చేస్తానని నేటి వరకు అమలు చేయడంలో విఫలమైనారన్నారు వెంటనే అమలు చేసి రైతులను ఆదుకోవాలని సూచించారు. రైతులకు కొత్త రుణాలు రాక పాత రుణాలు తీరక రాబోవు వానాకాలపు పంటలకు పెట్టుబడి సహాయంగా ఎటువంటి రుణాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలన్నారు. రైతులకు ఉచితంగా ఎరువులు విత్తనాలు సరఫరా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి నాగాటి చిన్న రాములు, రైతు సంఘం మండల అధ్యక్షులు ఎగ్గడి లింగయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నారసాని వెంకటేశ్వర్లు, బత్తిని వెంకటయ్య, ప్రజానాట్యమండలి జిల్లా ఉపాధ్యక్షులు బీ.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేయాలి…
రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు
కోదాడరూరల్ : రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేయాలి అని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి చేసి మాట్లాడారు. అనంతరం తాసిల్దార్ శ్రీనివాస శర్మకు మెమోరాండం అందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి ఎం ముత్యాలు, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు జుట్టుకొండ వీరయ్య, సంగమయ్య, కిషోర్, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.