రెండు కిడ్నీలు చెడిపోయి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన జనగం సుజాత కు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.2లక్షల 50వేల ఎల్ఓసి పత్రాన్ని బాధిత కుటుంబ సభ్యులకు గురువారం అందజేశారు. సుజాత రెండు కిడ్నీలు చెడిపోయి నిస్సహాయ స్థితిలో ఉండగా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ను సంప్రదించారు. ఆయన చికిత్స కోసం హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చేరవలసిందిగా సూచించి ఆస్పత్రికి పంపించారు. వైద్య సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సుజాత ఆమె వైద్య ఖర్చు నిమిత్తం రూ.2లక్షల 50వేల ఎల్ఓసి మంజూరు చేయించారు. అట్టి ఎల్ఓసి మంజూరు పత్రాన్ని బాధితురాలు భర్త శ్రీనివాస్ కు నిమ్స్ ఆస్పత్రిలో అందజేశారు. ఎల్ఓసి మంజూరుకు కృషి చేసిన సునీల్ రెడ్డికి బాధిత సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు