చాలా కాలం గుర్తుండిపోయే జపాన్‌..

చాలా కాలం గుర్తుండిపోయే జపాన్‌..హీరో కార్తి నటిస్తున్న తన 25వ చిత్రం ‘జపాన్‌’. ‘జోకర్‌’ ఫేమ్‌ రాజు మురుగన్‌ దర్శకత్వం వహించిన ఈ పాన్‌ ఇండియా హీస్ట్‌ థ్రిల్లర్‌ని డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌ ఆర్‌ ప్రకాష్‌ బాబు, ఎస్‌ ఆర్‌ ప్రభు నిర్మించారు.
అన్నపూర్ణ స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. ‘దీపావళి’ కానుకగా ఈనెల 10న గ్రాండ్‌గా థియేటర్స్‌లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత ఎస్‌ఆర్‌ ప్రభు మీడియాతో ముచ్చటించారు.
రచయిత, దర్శకుడు రాజు మురుగన్‌ ఆలోచనలు చాలా విలక్షణంగా ఉంటాయి. ఆయన సమాజాన్ని చూసే విధానం, ఏదైనా విషయాన్ని చెప్పే తీరు చాలా యూనిక్‌గా ఉంటుంది. నవ్విస్తూనే ఆలోజింపజేస్తారు. రాజు మురుగన్‌ చెప్పిన ‘జపాన్‌’ కథ కార్తికి చాలా నచ్చింది. ఇది క్యారెక్టర్‌ బేస్డ్‌ సినిమా. ముఖ్యంగా ‘జపాన్‌’ పాత్ర ప్రేక్షకుల మనసులో చాలా కాలం నిలిచిపోతుంది.
కార్తి కూడా డిఫరెంట్‌ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ప్రతిసారీ ఏదో కొత్తది చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మొదటి నుంచి ఒక క్యూరియాసిటీ ఉంది. గెటప్‌, వాయిస్‌ మాడ్యు లేషన్‌ ఇవన్నీ ప్రేక్షకుల దష్టిని ఆకర్షించాయి. ట్రైలర్‌, టీజర్‌ చూసినప్పటికీ ఇది ఎలాంటి సినిమానో అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో ఉంది. ఆ క్యూరి యాసిటీని మెయింటైన్‌ చేశాం.
ఇది క్యారెక్టర్‌ డ్రివెన్‌ మూవీ. కార్తి అద్భుతంగా చేశారు. జపాన్‌ పాత్ర చాలా ఫేమస్‌ అవుతుంది. కార్తి ‘ఎవ్వర్రా మీరంతా’ డైలాగ్‌ ఎంత వైరల్‌ అయ్యిందో.. జపాన్‌ కంటెంట్‌ కూడా చాలా వైరల్‌ అవుతుంది. పాత్ర సీరియస్‌గా ఉన్నప్పటికీ అతను ఏదైనా ఒక విషయాన్ని చూసే తీరు, మాట్లాడే విధానం ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతుంది. ఇది హీస్ట్‌ ఫిల్మ్‌. ఇందులో మానవత్వం గురించి ఉంటుంది. సొసైటీని రిఫ్లెక్ట్‌ చేసే ఎలిమెంట్స్‌ ఉంటాయి. సినిమా ఫన్‌గా ఉండటంతో ప్రేక్షకులకు ఖచ్చితంగా ఎంజారు చేస్తారు.
ఇక జపాన్‌ జీవితంలో అను క్యారెక్టర్‌ చాలా స్పెషల్‌. జపాన్‌ లానే అను పాత్ర కూడా ఊహా తీతంగా ఉంటుంది. ఆ పాత్ర ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుంది. జీవి ప్రకాష్‌ ఈ చిత్రానికి మ్యూజిక్‌ చేసిన విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. పాటలు కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. రవివర్మన్‌ దేశంలోనే గొప్ప టెక్నిషియన్‌. ఇందులో విజువల్స్‌ అద్భుతం.
నాగార్జున ఈ చిత్ర ట్రైలర్‌ టీజర్‌ చూసి ఇలాంటి డిఫరెంట్‌ కథలు, పాత్రలు ప్రతి సినిమాకి ఎలా చేయగలుగుతున్నారని కార్తిని అభినందించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ గత ఏడాది కార్తి ‘సర్దార్‌’ సినిమాని విడుదల చేసింది. సినిమా విషయంలో సుప్రియ, మా ఆలోచనలు ఒకేలా ఉంటాయి. ఎక్కువ రీచ్‌కి అన్నపూర్ణ స్టూడియోస్‌ మంచి ఫ్లాట్‌ ఫామ్‌.
ప్రస్తుతం కీర్తి సురేష్‌తో ‘కన్నివెడి’, అలాగే రష్మిక మందనతో ‘రెయిన్‌ బో’ చిత్రాలు చేస్తున్నాం. ఈ రెండూ వేటికవే భిన్నమైన సినిమాలు. ‘జపాన్‌’ మాదిరిగానే ఈ సినిమాలు సైతం ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తాయి.
– ఎస్‌ఆర్‌ ప్రభు