
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంతో ఆర్టీసీ కార్మికుల చిరకాల స్వప్నం నెరవేరిందని హైదరాబాద్ డిపో వన్ డిఎం కృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం గౌలిగూడా లోని డిపో 1లో సీఎం కెసిఆర్ చిత్రపటానికి ఆర్టీసీ ఉద్యోగులతో కలిసిపాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో కలపడం వల్ల ఆర్టీసీ కార్మికుల్లో చిరకాల స్వప్నం నెరవేరిందనే భరోసా కలిగిందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఉద్యోగులందరూ హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ స్వాతి. ఆర్టీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ బోర్డు సభ్యులు ఎం వెంకన్న. అకౌంటెంట్ బి ఎస్ రెడ్డి. స్టోర్ సూపర్వైజర్ డిఎస్ దేవప్రియం. ప్రకాష్ రెడ్డి ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.