వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి – కోరుట్ల ప్రధాన రహదారిపై శుక్రవారం భారీ లోడుతో వెళ్తున్న లారీ ఒక్కసారిగా బోల్తా పడింది. ఘటన ప్రాంతంలో నూతనంగా బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతూ ఉండటంతో తాత్కాలికంగా మట్టితో రోడ్డును వేశారు. ఆ రోడ్డు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చిందర వందర బురదమయం కావడంతో అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తా పడింది, కొన్ని ఏళ్లగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరికి ఎలాంటి అపాయం జరగలేదని స్థానికులు తెలిపారు. రహదారి పనులను త్వరగా పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.