హైవేపై అదుపుతప్పిన లారీరోలర్‌

హైవేపై అదుపుతప్పిన లారీరోలర్‌– విద్యుత్‌ స్తంభాల ఢీ.. తప్పిన పెనుప్రమాదం
నవతెలంగాణ-వేల్పూర్‌(ఆర్మూర్‌)
వేల్పూర్‌ మండలంలో లక్కొరా నుంచి మెట్‌పల్లి వెళ్లే జాతీయ రహదారిపై గురువారం పెనుప్రమాదం తప్పినట్టయింది. పెర్కిట్‌ నుండి మెట్‌పల్లి వైపు వెళ్తున్న లారీ రోలర్‌ వర్షం కారణంగా అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాలను ఢకొీట్టింది. స్తంభాలు ధ్వంసం కావడంతో కొన్ని గంటల పాటు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కాగా ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.