రుద్రంకోట కుర్రాడి ప్రేమకథ

సీనియర్‌ నటి జయలలిత సమర్పకులుగా వ్యవహరిస్తూ ఓ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రుద్రంకోట’. ఏఆర్‌కె విజువల్స్‌ పతాకంపై రాము కోన దర్శకత్వంలో అనిల్‌ ఆర్కా కండవల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్‌, విభీష, రియా హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి హీరో, నిర్మాత అనిల్‌ ఆర్క కండవల్లి మాట్లాడుతూ,’శ్మశాన వాటికలో పెరిగి పెద్దైన ఓ యువకుడి ప్రేమకథా చిత్రమిది. భద్రాచలం దగ్గర రుద్రంకోట అనే ఊరి నేపథ్యంలో కథ నడుస్తుంది. ఇప్పటి వరకు ఎవరూ చూపించని అంశాలను చూపిస్తున్నాం.
సంగీత దర్శకులు కోటి అద్భుతమైన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందిం చారు. ఇటీవల సెన్సార్‌ పూర్తయ్యింది. యు/ఏ సర్టిఫికెట్‌ ఇవ్వడంతో పాటు సినిమా బావుందంటూ సెన్సార్‌ సభ్యులు ప్రశంసించారు. మా సినిమా నచ్చడంతో స్క్రీన్‌ మాక్స్‌ సంస్థ ఆగస్ట్‌లో గ్రాండ్‌గా విడుదల చేస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు మా సినిమా తప్పకుండా నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాం’
అని తెలిపారు. ఆలేఖ్య, బాచి, రమ్య తదితరులు ఇందులో నటిస్తున్నారు.