వైవిధ్యమైన ప్రేమకథ

వైవిధ్యమైన ప్రేమకథజీ2హెచ్‌ మీడియా పతాకంపై సంతోష్‌ కష్ణ, వైష్ణవి కష్ణ, సిజు మీనన్‌, ప్రధాన పాత్ర ధారులుగా పులుగు రామకష్ణారెడ్డి దర్శ కత్వంలో నిర్మాతలు రామకష్ణారెడ్డి, శ్రీహరి రెడ్డి, కిరణ్‌ రెడ్డి నిర్మిస్తున్న ఎమోషనల్‌ ఎంటర్టైనర్‌ ‘మన్మయి’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీజర్‌ ఆవిష్కరణ బుధవారం ప్రసాద్‌ ల్యాబ్‌లో నిర్మాత రాజ్‌ కందుకూరి చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్టిస్ట్‌ నాగ మహేష్‌, బాలీవుడ్‌ నటుడు కరెన్‌ సింగ్‌, నటులు జయంత్‌, ఆర్టిస్ట్‌ యోగి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ, ‘ఈ సినిమాకి సంబంధించి కొన్ని స్టిల్స్‌ చూపించారు. బాగున్నాయనిపించింది. ఇక్కడకి వచ్చి టీజర్‌ చూశాక, మంచి కంటెంట్‌తో సినిమా చేస్తున్నట్లు అర్థమైంది. ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందాలి’ అని తెలిపారు. ‘ఇదొక ఎమోషనల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌. ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని పంచే సినిమా అవుతుంది’ అని డైరెక్టర్‌ పులుగు రామకష్ణారెడ్డి చెప్పారు. నిర్మాత శ్రీహరి రెడ్డి మాట్లాడుతూ, ‘మంచి లవ్‌స్టోరీతో మిమ్మల్ని మా మూవీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు. మరో నిర్మాత కిరణ్‌ రెడ్డి మాట్లాడుతూ, ‘మా మూవీ టీజర్‌ మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను. సినిమాను కూడా ఆదరించాలని కోరుకుంటున్నా’ అని తెలిపారు. హీరో సంతోష్‌ కష్ణ మాట్లాడుతూ, ‘మా మూవీ టీజర్‌ని స్క్రీన్‌ మీద మీరు చూసి, చప్పట్లు కొట్టగానే చాలా సంతోషంగా అనిపించింది. మీకు టీజర్‌ నచ్చిందంటే మా వర్క్‌ నచ్చిందనే భావిస్తున్నాం. ఇది ఒక ఎమోషనల్‌ మూవ్‌మెంట్‌ మా అందరికీ. మనసుకు హత్తుకునే మంచి లవ్‌స్టోరీతో మీ ముందుకు త్వరలోనే రాబోతున్నాం’ అని అన్నారు. ‘ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్‌ ఉంటాయి. ఎమోషనల్‌ రోలర్‌ కోస్టర్‌ సినిమా అనుకోవచ్చు. ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్‌, ప్రొడ్యూసర్స్‌కు థ్యాంక్స్‌’ అని హీరోయిన్‌ వైష్ణవి కష్ణ చెప్పారు.