ప్రకృతి ప్రేమికుడు -విశ్వానికి “మిత్రుడు “అయ్యాడు

Oplus_0

– నేటితో 40 రోజుల ఫలహార దీక్ష ముగింపు

– స్వ అనుభవంపై విశ్లేషణ 
– ఫ్రూటేరియన్ మహమూద్ పాషా
నవతెలంగాణ – ఆళ్ళపల్లి : సహజంగా ప్రకృతి ప్రేమికుడినైన నేను 40 రోజుల ఫలహార దీక్షతో విశ్వానికి మిత్రుడిని అయ్యాననే భావన కలుగుతుందని ఫ్రూటేరియన్, ప్రకృతి ప్రేమికులు జాకారం గ్రామం ఎంపీపీఎస్ హెచ్.ఎం షేక్ మహబూబ్ బాషా అన్నారు. నవంబర్ నెల 7వ తేదీన నిష్ఠతో ప్రారంభించిన 40 రోజుల ఫలహార దీక్ష నేటి(శనివారం)తో ముగియనున్న నేపథ్యంలో ఫ్రూటేరియన్ మహమూద్ పాషా స్వ అనుభవం నవతెలంగాణ ప్రతినిధితో శుక్రవారం పంచుకున్నారు. విశ్లేషణ ఆయన మాటల్లోనే.. ఫలహార దీక్షతో సృష్టిలోని ప్రతి ప్రాణిపట్ల గతంలో కంటే అధికంగా ప్రేమభావం పెరిగిందన్నారు. సృష్టిలో ప్రతి జీవి నిరంతరం హెల్దీ ప్రాపర్ రిలేషన్స్ తో జీవించాలనే సత్సంకల్పంతో దీక్ష ప్రారంభించానని, నేటితో ముగియనుండటం చాలా సంతోషంగా ఉందన్నారు. మానవుని నిజమైన ఆహారం ఫలములు మాత్రమే, వండిన ఆహారం తినడంతో మానవుడు అనేక రుగ్మతలు, మానసిక దౌర్భాల్యాలకు గురవుతున్నాడన్నారు.  ఫలములు నిరంతరం ఆహారంలా స్వీకరించడం వల్ల శరీరంలోని రుగ్మతలు తగ్గడమే కాక తగిన శరీర సహజ బరువుకు సులువుగా వచ్చేస్తారన్నారు. శరీరం  ఆరోగ్యవంతంగా ఉండేందుకు కనీసం ఆరు నెలల పాటు ఫలములను ఆహారంగా స్వీకరిస్తే మంచి ఫలితం చూడగలుగుతారన్నారు. 40 రోజుల ఫలదీక్షతో నా శరీర బరువు 11 కిలోలకు తగ్గిందన్నారు. మానసిక పరిపక్వత, అప్రిషియేట్, కృతజ్ఞత, పాజిటివ్ భావాలు, నియంత్రణ దృక్పథం దీక్షలో అలవడిందన్నారు. ప్రతి మానవుడు తినేది, తాగేది, చేయవలసింది, ఆలోచించాల్సిన ప్రక్రియలు సజావుగా చేస్తే నిత్యజీవితం సహజత్వం ఉట్టిపడుతుందని చెప్పారు. ఫల ఆహార దీక్ష పాటించే ప్రతి ఒక్కరూ ముందుగా 11 రోజులపాటు అలవర్చుకోవాలని, నెమ్మదిగా వీలును బట్టి పెంచుకుంటూ పోవాలని వివరించారు. దీక్షను ప్రారంభించేవారు ఒకే రకమైన పండ్లను ఒకసారి మాత్రమే, అన్ని రకాల పండ్లను ఒకేసారి తినడం చేయకూడదని, ఈ నియమని గుర్తించి దీక్షను చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని తెలిపారు. ఒక యాపిల్, ఒక దానిమ్మ, ఒక జామకాయ, రెండు అరటి పండ్లు ఇలా.. దీక్షా వ్యక్తి ఆరోగ్య సమస్యలు దృష్టిలో ఉంచుకుని పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఫలదీక్ష సమాచారం కోసం ఫోన్ నెంబర్ 8919055 737ను సంప్రదించాలన్నారు.