నవతెలంగాణ – కంఠేశ్వర్
అన్ని వర్గాల సమస్యలపై తనదైన గళాన్ని వినిపించే పత్రిక నవ తెలంగాణ దినపత్రిక అని ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత అన్నారు. నవ తెలంగాణ దినపత్రిక కు నవతెలంగాణ కులం, మతం, వర్గం అనే తేడాలు లేకుండా సామాజిక దృష్టితో అన్ని వర్గాల ప్రజలను చైతన్యం కోసం నిరంతరం పరితపించే పత్రిక. ప్రజలకు, ప్రభుత్వాలకు వారధిగా ఉంటూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వార్తా కథల రూపంలో ప్రభుత్వం దృష్టికి తెచ్చి, వాటిని పరిష్కరించడంలో ఎనలేని కృషి చేస్తుందని కొనియాడారు. ఎలాంటి వ్యాపార దృక్పథం లేకుండా సమాజ శ్రేయస్సు కోసం నిర్భయంగా నిజాలను నిష్పక్షపాతంగా చాటుకుంటున్న నవతెలంగాణ దినపత్రిక మున్ముందు ఇలాంటి ఎన్నో వసంతాలను పూర్తి చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. నవతెలంగాణ పత్రికకు తొమ్మిదో వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.