నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని మామిడిపల్లి శివారులోని గాంధీనగర్ లో గల ఆక్స్ఫర్డ్ పాఠశాలలో సాంఘిక శాస్త్ర ప్రదర్శన కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా పాఠశాల పరిపాలన అధికారిని పద్మ హాజరై మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు పుస్తకాలలోని పాఠాలతో పాటుగా ప్రతి పాఠానికి ఒక ప్రాజెక్టు తయారు చేయించాలని ఆ ప్రాజెక్టులతో విద్యార్థుల సృజనాత్మకత పెరుగుతుందని అన్నారు. విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయడానికి ఇలాంటి కార్యక్రమాలను మేము ప్రతి నెల మా పాఠశాలలో నిర్వహిస్తామని ఆమె అన్నారు. విద్యార్థులు తయారు చేసినటువంటి సాంఘిక శాస్త్రానికి సంబంధించిన ప్రాజెక్టులను ఆమె తిలకించారు. ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలను విద్యార్థుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. వాటి యొక్క ఉపయోగాలను విద్యార్థులు చక్కగా వివరించారు. అనంతరం గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రమేష్, స్కూల్ ఇన్చార్జి సృపన్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.