
నూతన ఆలూరు, దేగామా రోడ్డు మార్గంలో గస్తీ నిర్వహించుచుండగా ఆలూరు పల్లె ప్రకృతి వనం సమీపంలో రాజేష్ ముఖ్య అను వ్యక్తి గంజాయి ప్యాకెట్స్ అమ్ముతున్నారు అని సమాచారం మేరకు ఆర్మూర్ ఎక్సైజ్ శాఖ సిబ్బంది బుధవారం పట్టుకున్నట్టు ఎక్సైజ్ సీఐ స్టీవెన్సన్ తెలిపారు. అనుమానాస్పదంగా కనిపించిన రాజేష్ ముఖ్య అనే వ్యక్తిని పట్టుకొని తనిఖీ చేయగా అతని వద్ద గంజాయి ముఠా లభించిందని, వెంటనే అతన్ని అరెస్టు చేసి ఎక్సైజ్ స్టేషన్ కు తరలించి అతని వద్ద ఉన్నటువంటి 220 గ్రాముల గంజాయిని సీజ్ చేసి కోర్టులో హాజరు పరచడం జరిగింది. ఈ తనిఖీలు ఆర్మూర్ సబ్ ఇన్ స్పెక్టర్ ఏ గంగాధర్, ప్రమోద్ చైతన్య, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ గౌడ్ కానిస్టేబుల్స్ దేవిదాస్, సాయిబాబా గౌడ్, గొల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.