
వివాహం కావడం లేదని తీవ్ర మనస్తాపం చెంది వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన శ్రీకాంత్ గౌడ్ (36) కొంతకాలంగా ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కుదరడం లేదని తీవ్ర మనస్తాపం చెంది మంగళవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు.