నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం గ్రామానికి చెందిన షేక్ షౌకత్ అలి (35) తాగుడుకు బానిసై ఇంట్లో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం రోజు రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పోచారం గ్రామానికి చెందిన షేక్ షౌకత అలీ గత ఆరు సంవత్సరాల క్రితం వివాహమైంది. కుటుంబ కలహాలతో భార్య శాబిన గత మూడు సంవత్సరాలుగా తమ తల్లి గారి ఇంటి వద్ద ఉంటుంది. భార్య కాపురానికి రావడం లేదని తాగుడుకు బానిసైన షౌకత్ అలి భార్య పిల్లలు తన వద్దకు రావడంలేదని గురువారం రోజు రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో చీరతో దూలానికి ఉరివేసుకొని మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. అన్న మసూద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.