గొర్లు కాస్తూ వ్యక్తి మృతి

నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మండలంలోని కలిగోటు గ్రామ శివారులో గొర్లు కాస్తు ఒక వ్యక్తి మృతి చెందినట్లు జక్రాన్ పల్లి ఎస్సై తిరుపతి గురువారం తెలిపారు. కలిగొట్ గ్రామ శివారులో కాకరకాయల సంతోష్ పొలంలో, ముక్కెర గంగమల్లు వ. 50 సం.లు గొర్ల కాస్తుండగా సాయంత్రం అందజూ 03:00 గం.లు చనిపోయి పడి ఉన్నాడని, హార్ట్ స్ట్రోక్ లేదా మరే ఇతర కారణం వల్ల చనిపోయి ఉండవచ్చని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనైనదని ఎస్సై తిరుపతి తెలిపారు.