విద్యుత్ స్తంభం పై నుండి పడి వ్యక్తి మృతి

నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మారం బి గ్రామం లో గురువారం మధ్యాహ్నం విద్యుత్ స్తంభం పై నుండి పడి ఒకరికి తివ్ర గాయాలై అసుపత్రి లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. స్థానికులు, పోలిసులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ నగరం లోని  ఇంద్రపుర్ కాలనీ కి చెందిన షేక్ నదిమ్ ఖాన్ తన చిన్న తమ్ముడు షేక్ అంజాద్ 32 తో కలిసి మధ్యాహ్నం  ప్రాంతంలో దర్మారం బీ గ్రామంలో విద్యుత్ స్తంభం వైర్లను బిగించే పనులు చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి  క్రిందికి పడి తివ్ర గాయాలపాలయ్యారు. వేంటనే స్థానికులు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు వారు వివరించారు. ఓకే ప్రైవేట్ వ్యక్తులచే స్తంభాల వైర్లను, స్తంబాలు మార్చడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.గ్రామంలో విద్యుత్ శాఖ కు చెందిన అదికారులు ఉండగా ప్రైవేట్ వ్యక్తులచే పనులను చక్కబెట్టి ప్రాణాలు కోల్పోయాడని, విద్యుత్ శాఖ నియమా నిబంధనల ప్రకారం ముందస్తుగా విద్యుత్ శాఖ అధికారుల వద్ద నుండి ఇస్టిమెంట్ వేసి వారి అద్వర్యంలో పనులు చేయవల్సి ఉంటుందని, కాని ఇలా జరగలేదని ఓక నిండు ప్రాణం పోయిందని గ్రామస్తులు తెలిపారు.నిజా నిజాలు బయటకు తీసి బాదిత కుటుంబానికి అందుకోవాలని పలువురు కోరుతున్నారు.