బావిలో పడి వ్యక్తి మృతి

మృతినవతెలంగాణ-ఝరాసంగం
మద్యానికి బానిసై మతిస్థిమితం లేకుండా ఓ వ్యక్తి బావిలో పడి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో జరిగింది. స్థానిక ఎస్సై నరేష్‌ తెలిపిన వివరాల ప్రకారం..మండల పరిధిలోని మాచ్నూర్‌ గ్రామం ముల్క శ్రీనివాస్‌ (35) పెయింటింగ్‌ పనిచేస్తుండేవాడు. మతిస్థిమితం లేకుండా మద్యానికి బానిసై తిరిగేవాడు. ఈనెల 5వ తేదీన ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండా పోయాడు. చుట్టుపక్కల ఎక్కడ వెతికిన ఆచూకీ కనబడకపోవడంతో గురువారం గ్రామ శివారులోని బేగరి తుల్జప్ప వ్యవసాయ బావిలో శవమై కనిపించాడు. వెంటనే ఆయన అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బావిలో నుంచి శవాన్ని తీసి పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.