ఫ్యాన్ కు ఉరేసుకుని వ్యక్తి మృతి

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు గ్రామానికి చెందిన చింతల కిరణ్ తండ్రి రాములు వయస్సు 26 సంలు. టైల్స్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సంక్రాంతి పండుగ ఆదివారం ఉదయం 11:30 గంటల సమయంలో భార్యతో గొడవపడి మనస్థాపం చెంది ఇంట్లోనే ఎవరు లేని సమయంలో చీరతో ఫ్యానుకు ఉరేసుకుని మృతి చెందాడు. మృతునికి కుమారుడు చింటూ 1సంలు, కుమార్తె 11 రోజుల పాప (ఇంకా పేరు పెట్టలేదు). మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సబ్ ఇన్స్పెక్టర్ యాదగిరి తెలిపారు.