మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 2 రోజు జైలు శిక్ష

నవతెలంగాణ కంఠేశ్వర్ 
నగరంలోని ఒకటవ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష పడిందని ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ తిరుపతి మంగళవారం తెలిపారు. ఎస్ హెచ్ ఓ తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం..నిజామాబాద్ కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తేదీ 29-01-2025 నాడు గాంధీ చౌక్ నందు బి. రఘుపతి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 1 టౌన్ నిజామాబాద్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తి మద్యం సేవించి బండి నడుపుతు పట్టుబడ్డాడు. ఇతన్ని గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరచగా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్  (2) రోజుల జైలు శిక్ష విధించగా, ఇతన్ని జైలు కు తరలించడం జరిగింది అని తెలియజేశారు.