నవతెలంగాణ – కంటేశ్వర్
అభం శుభం తెలియని పసి బాలికపై అత్యాచారం చేసిన కామందున్ని కఠినంగా శిక్షించాలి అని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. ఏ మేరకు ఆదివారం నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో పట్టణంలోని ఆరు సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసిన గంగాధర్ అనే యువకుడిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వ సలహాదారు కోరారు వారి కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ఆర్థిక సాయం అందజేశారు. అలాగే ప్రభుత్వం నుండి రావలసిన ఎక్సగ్రేషియా త్వరలో అందే విధంగా అధికారులను ఆదేశించారు. బాలిక కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ దృష్టికి తీసుకురాగా వారు విషయం తెలుసుకొని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా సీపీ కి ఫోన్లో మాట్లాడి నిందితుడిని కఠినంగా శిక్ష పడేవిధంగా చర్యలు చేసుకోవాలని కోరారు. మహిళా శిశు సంక్షేమ అధికారిని ఫోన్లో మాట్లాడి బాధితులకు వెంటనే తక్షణ సాయం అందించాలని ఆదేశించారు. అలాగే బార్ కౌన్సిల్లో మాట్లాడి ఇలాంటి కామందుల తరపున ఏ న్యాయవాది కూడా వకాలత్ తీసుకొని వాదించకూడదని కోరారు.బాధిత బాలికకు ఆసుపత్రిలో అయ్యే వైద్య ఖర్చు కూడా నేనే భరిస్తానని తక్షణ సహాయం అందజేశారు వారి కుటుంబానికి అండగా ఉంటాను అన్నారు.