గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

నవతెలంగాణ – భువనగిరి

గంజాయిని తరలిస్తున్న దూళిపేట్ కు చెందిన ఆదర్శ సింగ్ ను క్సైజ్ పోలీసులు సోమవారం అదుపులో తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం  హైదరాబాద్ దూలిపేట్ చెందిన ఆదర్శ సింగ్ అనే వ్యక్తి హోండా యాక్టీవ్ బైక్ మీద 120 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అతను ఏవోబి నుంచి బస్సులో గంజాయిని తీసుకొచ్చి యాదగిరిగుట్టలో సరఫరా చేస్తున్నట్లు వివరించారు. అతనిపై కేసు నమోదు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు పంపినట్లు తెలిపారు.