చేపలు వేటకు వెళ్లిన వ్యక్తి మృతి

– ముగ్గురిని రక్షించిన తోటి వ్యక్తులు
నవతెలంగాణ – అశ్వారావుపేట
చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు.స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం మండలంలోని రామన్నగూడెం కు చెందిన పదిమంది గిరిజనులు గంగారం శివారులోని ఓ చెరువు వద్దకు చేపలు పట్టేందుకు వెళ్లారు. చేపలను పడుతున్న క్రమంలో చెరువులోని లోతును గమనించలేదు.ఈ క్రమంలో నారం పెద్ద మంగ రాజు (32), నారం రామారావు,అశోక్ కుమార్, గడ్డం నాగేశ్వరరావు చెరువు లోతు ప్రాంతంలో చేపల వేట కొనసాగించారు. నారం పెద్ద మంగ రాజు ముందుగా మునిగిపోయాడు. మిగిలిన వారు మునిగిపోతూ కేకలు వేయడంతో చేపలు పట్టేందుకు వచ్చిన మిగిలినవారు తాళ్లు ఇతర వస్తువుల సాయంతో ముగ్గురిని కాపాడారు. అశోక్ కుమార్ అనే వ్యక్తి చెరువులోని నీళ్లు త్రాగడం తో నీటిని కక్కించి చికిత్స కోసం అశ్వారావుపేట సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. నీటిలో మునిగిపోయిన మంగ రాజు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామస్తులు అక్కడకు వచ్చి వివరాలు సేకరించారు.మృత దేహాన్ని చెరువుల నుంచి బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీ రూమ్ కి తరలించారు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు.చేపల వేట కారణంగా నారం పెద్ద మంగ రాజు మృతి చెందటంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.