చేపల వేటకు వెళ్లిన వ్యక్తి మృతి 

నవతెలంగాణ- తొర్రూర్ రూరల్
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెంకటాపురం గ్రామంలోని బల్ల చెరువులో చేపల వేటకు వెళ్లి గత రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన గుండాల చిన్న నరసయ్య (50) శవం చెరువు లోపల నీటిపై తేలి లభ్యమయ్యింది. నరసయ్యకు భార్య సత్తమ్మ కుమారుడు శశిధర్ లు ఉన్నారు.