ఆత్మహత్యకు పాల్పడిన వివాహితుడు

నవతెలంగాణ – అశ్వారావుపేట
క్రిమిసంహారక ఔషధం తీసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలో జరిగింది.స్థానికుల కథనం ప్రకారం మండలంలోని జెట్టి వారిగూడెం కు  చెందిన కుర్సం అర్జున్ (33),తన భార్య సునీత తో కొంతకాలంగా కుటుంబ కలహాల నేపథ్యంలో వివాదాలకు దిగే వాడు. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం కుడా అర్జున్ తన భార్యతో గొడవ పడి ఇరుగు పొరుగు ఎదుటే ఆమెపై దాడికి పాల్పడగా, అడ్డు వెళ్లిన వారిని అసభ్య పదజాలంతో తిట్టాడు..అనంతరం మనస్థాపం కు గురై క్షణికావేశంలో ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి  తరలించారు.ఆస్పత్రిలో వైద్యులు పరీక్షించి పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్యతో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ. శ్రీరాముల శ్రీను వివరాలను సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.