ఓ వివాహిత ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. మృతురాలు తండ్రి తిరుమలరావు పిర్యాదు మేరకు స్థానిక ఎస్.హెచ్.ఒ ఎస్ఐ పీ.శ్రీకాంత్ కథనం ప్రకారం.. మండలంలోని పేరాయిగూడెం పంచాయతీ మోడల్ కాలనీ కు చెందిన పొదిలి గౌరి(22)కు ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామకు చెందిన గోపీనాధ్ తో ఏడాది క్రితం వివాహం అయింది.భర్త లారీ డ్రైవర్ కాగా,ఈ దంపతులకు మూడు నెలల బాబు ఉన్నాడు.గడిచిన గతకొద్ది రోజులుగా భార్యపై అనుమానంతో భర్త వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ వేధింపులు తాళలేక కొద్ది రోజులు క్రితమే గౌరి తన పుట్టింటికి వచ్చి ఉంటుంది. అయినా సరే భర్త వేధింపులు ఆగలేదు.దాంతో మనస్తాపం చెందిన గౌరి ఆదివారం రాత్రి కుటుంబీకులు అందరూ చర్చి కు వెళ్లగా,వారంతా ఇంటికి వచ్చే సరికే ఆమె ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.తన కుమార్తె మృతికి భర్త వేధింపులే కారణమని తండ్రి బత్తిన తిరుమలరావు చేసిన లిఖిత పూర్వక ఫిర్యాదు పై మృతదేహానికి స్థానిక సీ హెచ్ సీ లో శవ పంచనామా జరిపించారు. మృతికి కారణమైన భర్త గోపినాథ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.