మాదాపూర్‌లోని హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం

నవతెలంగాణ హైదరాబాద్‌: నగరంలోని మాదాపూర్‌ డీమార్ట్‌ ఎదురుగా ఉన్న కృష్ణ కిచెన్‌ రెస్టరంట్‌లో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలముకుంది.