గోల్ఫర్‌ అతిథికి పతకం ఖాయం

A medal is guaranteed for the golfer's guest– దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ జోస్యం
న్యూఢిల్లీ: పారిస్‌ ఒలింపిక్స్‌లో మహిళా గోల్ఫర్‌ అతిథి అశోక్‌ పతకం సాధించడం ఖాయమని దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ జోస్యం చెప్పాడు. భారత గోల్ఫ్‌ ఫెడరేషన్‌(పిజిటిఎ)కు అధ్యక్షునిగా ఉన్న కపిల్‌దేవ్‌ గురువారం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు, ఖర్చులు, నిధులను సక్రమంగా విడుదల చేస్తే యువ గోల్ఫర్లు వెలుగులోకి రావడం ఖాయమని అన్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో అతిథి అశోక్‌ పతకానికి చేరువై తృటిలో కాంస్య పతకానికి చేజార్చుకొని 4వ స్థానంతోనే సరిపుచ్చుకుందన్నారు. ఆ ఒలింపిక్స్‌లో 2స్టోక్ట్స్‌తో నెల్లి కొర్డా స్వర్ణ పతకం చేజిక్కించుకోగా. ఒక స్టోక్స్‌ వ్యత్యాసంతో రజిత, కాంస్య పతకాలు అతిథికి చేజారాయని చెప్పుకొచ్చారు. ఇటీవలికాలంలో అద్భుత ప్రదర్శనతో అతిథి రాణిస్తోందని, దీంతో ఆమె వరుసగా రెండోసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిందన్నారు. ఆ స్థాయి ప్రదర్శనను పారిస్‌ ఒలింపిక్స్‌లోనూ కనబరిస్తే పతకం సాధించడం ఖాయమని అన్నారు.