గిరిజన గ్రామంలో వైద్యశిబిరం 

నవతెలంగాణ – అశ్వారావుపేట : మండల పరిధిలోని మారుమూల అటవీ ప్రాంతంలో గల మొద్దలమడ  లో వినాయకపురం వైద్యశాల ఆద్వర్యంలో వైద్యాధికారి డాక్టర్ రాందాస్ పర్యవేక్షణలో శుక్రవారం ఉచిత వైద్యారోగ్య శిబిరం నిర్వహించారు. చిరు వ్యాధులతో బాధపడుతున్న 33 మందిని పరీక్షించి మందులు అందజేసారు.నలుగురు జ్వర పీడితులు ను గుర్తించి రక్త నమూనాలు సేకరించి ఆర్.డి.టి పరీక్షలు నిర్వహించారు.మలేరియా నిర్ధారణ కాకపోవడంతో తరుణ వ్యాధులకు చికిత్సను అందించాను. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ ఆఫీసర్ అజ్మీరా వెంకటేశ్వరరావు,హెచ్.ఎస్ శ్రీనివాస్,హెచ్.ఇ.ఒ రాజు,ఎం.టి.ఎస్ విజయారెడ్డి.హెచ్.ఎ సత్యనారాయణ లు పాల్గొన్నారు.