విషజ్వరాలతో బాధపడుతున్న గ్రామ ప్రజలకు మెడికల్ క్యాంప్ ఏర్పాటు

– ఎడవెల్లి అనుపమ నరేందర్ రెడ్డి గారు
నవతెలంగాణ – హలియా
హాలియా మున్సిపాలిటీ  ఇబ్రహీంపేట గ్రామంలో తీవ్ర జ్వరాలు ఒళ్ళు నొప్పులతో ఇబ్బందులు పడుతున్న గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబంలో ఒకరిద్దరికి చోప్పనా జ్వరాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ మానసికంగా, ఆర్థికంగా కరువులో ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని గ్రామ ప్రజల అవసరాల నిమిత్తం తెలుసుకొని హాలియా మున్సిపాలిటీ రెండో వార్డ్ కౌన్సిలర్ ఎడవెల్లి అనుపమ నరేందర్ రెడ్డి  మెడికల్ క్యాంప్ ఏర్పాటు జేశారు.  ఇబ్రహీంపేట గ్రామ ప్రజలకి,గ్రామంలోనే డాక్టర్ల పర్యవేక్షణలో రక్త పరీక్షలు మరియు కొంతమంది దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారికి అలాగే జ్వరాలతో ఒళ్ళు నొప్పులతో ఇబ్బంది పడుతున్న పేషెంట్లకు అవసరమగు మెడిసిన్లు గ్రామంలో అందించారు. క్యాంపు ఏర్పాటు చేసినందుకు గ్రామ ప్రజలు అనుపమ మహేందర్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేశారు.