రేగళ్ళ గుంపును సందర్శించిన వైద్య బృందం

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆదివాసీల అరణ్య రోదన అనే శీర్షికన నవతెలంగాణ లో ప్రచురితం అయిన కథనానికి ప్రభుత్వం యంత్రాంగాలు కదిలాయి.ఇప్పటికే ఐటిడిఏ అధికారులు తాత్కాలిక మంచినీటి సౌకర్యం కోసం చర్యలు చేపట్టారు.గురువారం జిల్లా సంక్షేమ అధికారిణి వేల్పుల విజేత ఆ గ్రామాన్ని సందర్శించి వారికి కావాల్సిన కనీస సౌకర్యాలను అడిగితెలుసుకున్నారు. ఆ గ్రామంలో గత మూడేళ్లుగా తరుచూ శిశు మరణాలు జరుగుతున్న నేపధ్యం వాటికి గల కారణాలు తెలుసుకోవడం కోసం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ బాలాజీ నాయక్,సి.హెచ్.ఒ నాగభూషణం నేతృత్వం లో శుక్రవారం రేగళ్ళ గుంపును సందర్శించారు. ఈ బృందం ముందుగా గుమ్మడవల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు.అనంతరం రేగళ్ళ గుత్తి కోయ గుంపును చేరుకుని అక్కడ జరిగిన శిశు మరణాల పై విచారణ జరిపారు.ఈ విచారణ పూర్తి కాలేదని,సంపూర్ణ నివేదికను కలెక్టర్ ప్రియాంక అల,డి ఎం అండ్ హెచ్ ఓ కు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుమ్మడవల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ మధుళిక,డాక్టర్ వెంకటేశ్వర్లు, హెల్త్ సూపర్వైజర్ పి.దుర్గమ్మ, స్థానిక ఏ.ఎన్.ఎం రేవతి,హెల్త్  అసిస్టెంట్ లు భాస్కర్, పి.వెంకటేశ్వర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.