టీయూలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమావేశం…

నవతెలంగాణ – డిచ్ పల్లి
కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమ రెగ్యులరైజ్ విషయమై హైదరాబాద్లో గత రెండు రోజుల నుంచి మంత్రివర్గ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులను కలిశామని ఈనెల ఆరు న సబ్ కమిటీ ద్వారా ఈ సమస్యలను వెంటనే పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నట్లు తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఘం అధ్యక్షులు దత్తాహరి అన్నారు.సోమవారం తెలంగాణ యూనివర్సిటీ లో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో  12 యూనివర్సిటీ లలో పనిచేస్తున్నటు కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు సమిష్టిగా రెగ్యులరైజ్ చేయాలని ఎర్రబెల్లి దయాకర్ రావు,స్పికర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ బండ ప్రకాష్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి లను మహాత్మా గాంధీ విసి గోపాల్ రెడ్డి, రిజిస్ట్రార్ మహాత్మా గాంధీ ప్రొఫెసర్ కృష్ణారావు లు  సమస్యలను వివరించారని తెలిపారు. ఆరున క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో  సమస్యను పరిష్కారం చేస్తారని మా సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తారని తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్టు ఉపాధ్యాయులందరూ సమిష్టిగా తీర్మానం చేశారు. మా మొదటి డిమాండ్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లను రెగ్యులరైజ్ చేయలని కోరారు. తెలంగాణ యూనివర్సిటీలో పనిచేస్తున్న అధ్యాపకులు  రెగ్యులరైజ్ అయ్యేవరకు సమిష్టిగా పోరాటం చేస్తామని గత 43 రోజుల నుంచి చేస్తున్నటువంటి పోరాటానికి ప్రభుత్వం స్పందించి డేటా,ఇతర వివరాలను ఉన్నత విద్యా మండలి కమిషనర్ నుండి ఆదేశాలు రావడం  తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్  వెంటనే స్పందించి పూర్తి వివరాలను హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషనర్ కార్యాలయానికి, చైర్మన్ కార్యాలయానికి పంపడానికి ముఖ్య కారణం పోరాట ఫలితమే నన్నారు.