– విద్యార్థులను సమాజంలో మంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి
– రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్
నవతెలంగాణ- జమ్మికుంట
విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధిస్తూ, సమాజంలో మంచి ఉత్తమ పౌరులుగా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ , ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి లు అన్నారు. శనివారం స్థానిక శం క రానందన్ గార్డెన్ లో ట్రస్మా ఆధ్వర్యంలో హుజరాబాద్ నియోజకవర్గం స్థాయి గురుపూజోత్సవం, ప్రైవేటు పాఠశాలల లో పనిచేసే ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోయినపల్లి వినోద్ కుమార్, పాడి కౌశిక్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రైవేటు ఉపాధ్యాయులను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడారు.పది సంవత్సరాల పార్లమెంట్ సమావేశాల్లో అనేక సందర్భాల్లో ప్రైవేటు టీచర్ల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని తెలిపారు. బీడీ, ఆటో,న్యాయవాదులు అందరికీ సంరక్షణ చట్టాలు ఉన్నాయి,కానీ ప్రైవేట్ ఉపాధ్యాయులకు మాత్రం చట్టాలు లేవని ఆయన తెలిపారు. దురదృషవశాత్తు ప్రైవేట్ ఉపాద్యోగులు చనీపోతే వారికీ సంరక్షణ లేదని ,బడ్జెట్ లో ప్రైవేట్ ఉపాధ్యాయులకు కూడా సంరక్షణ చట్టం అమలు తేవాలి అని పార్లమెంటు లో కోట్లాడా అని గుర్తు చేశారు.ట్రస్మా అధ్వర్యంలో హైదరాబాద్ లో లక్ష మందితో భారీ సభ నిర్వహించాలన్నారు. 24 గంటల ఉచితవిద్యుత్తునుఅందిస్తున్నామన్నారు.ఈటెలరాజేందర్ ను నేను అడుగుతున్న ఏ రైతైనా రాత్రి పూట కరెంట్ బావుల దగ్గరికి వెళుతున్నాడ అను ప్రశ్నించారు.గతానికంటే తెలంగాణలో సాగు నీటి కష్టాలు చాలా తీరాయి అని చెప్పారు. గురుకులల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు.భారతదేశంలో ఉన్న ప్రైవేట్ టీచర్లకు సాంఘీక సంక్షేమ చట్టం రావాలనీ ఈ సభ ద్వారా తీర్మానం చేయాలన్నారు. ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడారు.ఉపాధ్యాయులకు సన్మానం చేయటం నా అదృష్టం అన్నారు.సమాజాన్ని తయారు చేసే వారిలో ఉపాధ్యాయులు ముందు వరసలో ఉంటారన్నారు.ప్రైవేట్ టీచర్స్ కి హెల్త్ కార్డ్స్ ఇవ్వాలనీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా అని చెప్పారు.ఒక్క అవకాశం ఇవ్వండి హుజూరాబాద్ ను మరో సిద్దిపేట,సిరిసిల్ల,కరీంనగర్ లాగా అభివృద్ధి చేస్త అని అన్నారు. జమ్మికుంట, హుజరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తానన్నారు.వావిలాల, చల్లూర్,శనిగరం మండలాలుగా చేస్తానని,అద్భుతమైన స్పోర్ట్స్ స్టేడియాలు నిర్మిస్తానని ఆయన హామీ ఇచ్చారు.ఈసారి నాకు అవకాశం ఇస్తే హుజురాబాద్ నియోజక వర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపిస్తానని కౌశిక్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ,జడ్పిటిసి డాక్టర్ శ్రీరామ్ శ్యామ్, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్నకోటి, ట్రస్మా నియోజకవర్గ అధ్యక్షులు ము సి పట్ల తిరుపతిరెడ్డి, పాఠశాలల కరస్పాండెంట్లు తదితరులు పాల్గొన్నారు.