కలెక్టర్ ఆదేశాలతో మండల స్థాయి అన్నిశాఖల అధికారులతో సమావేశం

A meeting with the officials of all departments at the Mandal level with the orders of the Collectorనవతెలంగాణ – జుక్కల్

మండలంలో విధులు నిర్వహిస్తున్న అన్ని శాఖల అధికారులతో  కామారెడ్డి జిల్లా  కలెక్టర్ ఆదేశాల మేరకు  శుక్రవారం నాడు మండల పరిషత్ కార్యాలయంలో తహసీల్దార్ హిమబిందు  నిర్వహించారని ఆర్ఐ రామ్ పటేల్ తెలిపారు. ఈ సంధర్భంగా కొన్ని రోజులుగా వర్షాలు పడుకున్న సంధర్భంగా గ్రామాలలో పాత ఇండ్లలో నివాసముంటున్న వారిని వేరే ఇంటిలోకి మార్చే విధంగా, గ్రామీలలో రోగాల బారిన పడకుండా  వైద్యాదికారులకు గ్రామాలకు సందర్శించే విధంగా అలెర్ట్ చేయాలని, శానీటేషన్, త్రాగునీరు, విది లైట్లు, విద్యుక్ స్థంబాల పరిస్థితి అంచనా, రోడ్లు డ్యామేజ్, సమస్యలను పరీశీలించి నివేదికలు తయారు చేసి ఉంచాలని  ఎమ్మార్వో హిమబిందు పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఆర్ఐ,  ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో రాము, ఏఈ డ్రింకింగ్ వాటర్ నయూమ్, కౌలాస్ నాళా ప్రాజేక్ట్ ఏఈ రవిశంకర్, జీపీ కార్యదర్శులు, ఉపాదీ సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.