నూతన ఎమ్మెల్యే మురళి నాయక్ ను కలిసిన వార్డు సభ్యురాలు 

– రావిరాల గ్రామ వార్డు సభ్యురాలు ఆకుల మంజుల యాకన్న

నవతెలంగాణ- మహబూబాద్
మహబూబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ ను కలసి మా రావిరాల గ్రామ అభివృద్ధి కోసం అధిక నిధులు కేటాయించాలని కోరినట్లు ఆ గ్రామ వార్డు సభ్యురాలు ఆకుల మంజుల యాకన్న తెలిపారు గురువారం నూతనంగా గెలుపొందిన ఎమ్మెల్యే డాక్టర్ లేకున్నా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా శాలువాతో సత్కరించే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మా గ్రామ అభివృద్ధి కోసం మీ వంతు కృషి చేయాలని తెలిపారు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపినట్టు చెప్పారు మా గ్రామ వెనుకబడి ఉంది కనుక మీరు ప్రత్యేక చొరవ తీసుకొని మా గ్రామాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి పరిచేందుకు కృషి చేయాలని కోరినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు రేఖ అశోక్ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు కత్తుల కృష్ణ ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ జిలకర యాలాద్రి గోరంట్ల రవి తదితరులు పాల్గొన్నారు