మనసుల్ని కదిలించే కథ

సాయికుమార్‌, ఆదిత్యా ఓం, ఐశ్వర్య, రాజీవ్‌ కనకాల, శ్రీనివాస్‌ సాయి. దీపాలి రాజ్‌పుత్‌ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘నాతొ నేను’. శాంతి కుమార్‌ తూర్లపాటి (జబర్దస్ట్‌ ఫేం) దర్శకత్వంలో ప్రశాంత్‌ టంగుటూరి నిర్మించారు. నేడు (శుక్రవారం) గ్రాండ్‌గా విడుదల కానుందీ చిత్రం. ఈ సందర్భంగా మంగళవారం ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుకగా వైభవంగా జరిగింది.
సాయికుమార్‌ మాట్లాడుతూ, ‘మనసును కదిలించే కథతో సినిమా రూపొందించారు. పాటలు, మాటలు అన్ని చక్కగా కుదిరాయి. నిర్మాత తన శక్తి దాటి ఖర్చు చేశారు. అవుట్‌పుట్‌ బాగా వచ్చింది’ అని తెలిపారు. ”జబర్దస్త్‌ కమెడీయన్‌గా ప్రేక్షకుల ఆదరణ పొందాను. కమెడీయన్‌గా ఉన్న నేను దర్శకత్వం వహించే వరకూ వచ్చానంటే నా నిర్మాతలే కారణం. అందరి సహకారంతో సినిమా బాగా వచ్చింది’ అని దర్శకుడు శాంతికుమార్‌ చెప్పారు. ‘చక్కని కథకు అన్ని సమపాళ్లతో కుదరడంతో మా వరకూ ఇది పెద్ద సినిమాగా నిలిచింది’ అని నిర్మాత ప్రశాంత్‌ టంగుటూరి చెప్పారు.