– సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వెంకన్న
నవతెలంగాణ-పినపాక
రైతులు పండించే పంటకు కనీస మద్దతు ధర కల్పించి, చట్టబద్ధత కల్పించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నిమ్మల వెంకన్న డిమాండ్ చేశారు. సోమవారం పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్‌లో అఖిలపక్ష పార్టీ నాయకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై బీజేపీ ప్రభుత్వం కాల్పులకు తెగబడటం సరికాదన్నారు. మద్దతు ధర అడిగిన రైతులపై కాల్పులు జరుపుతారా అంటూ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు తోట వెంకటేశ్వర్లు, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకులు మడివి రమేష్ పాల్గొన్నారు.