మత్స్యశాఖకు మంత్రినీ కేటాయించి, మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేయాలి

మత్స్యశాఖకు మంత్రినీ కేటాయించి, మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేయాలి– మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల జిల్లా సమాఖ్య చీఫ్‌ ప్రమోటర్‌ గోరింకల నర్సింహ
– టీఎంకేఎంఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి బోద్రమోనీ నర్సింహ
నవతెలంగాణ-మంచాల
రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖకు మంత్రి కేటాయించి, మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేయాలని మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల రంగారెడ్డి జిల్లా సమాఖ్య చీఫ్‌ ప్రమోటర్‌ గొరెంకల నరసింహ అన్నారు. బుధవారం మండల పరిధిలోని లోయపల్లి మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో ముదిరాజ్‌ సంఘం కార్యాలయం సమీపంలో జిల్లా చీఫ్‌ ప్రమోటర్‌ గొరెంకల నర్సింహ ను శాలువతో ఘనంగా సన్మానించారు. అనతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలలోని గ్రామ పంచాయతీ చెరువులు, కుంటల మత్స్య కారులకే పూర్తి హక్కులు ఉన్నాయనీ, ఇతరులు వచ్చి ఎవరైనా అనవసరమైన రాద్దాంతం చేస్తే చట్ట రీత్యా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటుందన్నారు. ప్రభుత్వం వెంటనే ప్రతి మత్స్య సొసైటీకీ వందశాతం సబ్సిడీతో రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మత్స్య సహకార సంఘం మండల ప్రధాన కార్యదర్శి బోద్రమొనీ నర్సింహ మాట్లాడుతూ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల రంగారెడ్డి జిల్లా సమాఖ్య చీఫ్‌ ప్రమోటర్‌లుగా ఎన్నికైన గోరింకల నర్సింహ, దూస వెంకటేష్‌లను లోయపల్లి మత్స్యపారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో సన్మానించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలగొని కొండల్‌, జిల్లా అధ్యక్షులు చినమొని శంకర్‌, తవిటి యాదగిరి, ఆడేపు వెంకటేష్‌, కావలి ధనంజయ, ఏ.భిక్షపతి, అచ్చయ్యా, కె.వెంకటేష్‌, హెచ్‌. హన్మంతు, ఎ.వెంకటేష్‌, పి.వినరు, ఎం.శ్రీశైలం, ఆర్‌.జంగయ్య, ఎ.రాజు తదితరులు పాల్గొన్నారు.