– కళాశాల బస్సు నడుపుతూ డ్రైవర్‌కు గుండెపోటు
– ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి
నవతెలంగాణ-రాజేంద్రనగర్
శంషాబాద్ వర్థమాన్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యా ర్థులకు శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. విద్యార్థు లను తీసుకొని కళాశాలకు వస్తున్న బస్సు డ్రైవర్‌కు బస్సు నడుపుతుండగా గుండెపోటు వచ్చింది ఇది గమనించిన విద్యార్థుల ఆస్పత్రికి తరలిస్తుండగానే అతడు మృతి చెంది న సంఘటన శుక్రవారం అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరి ధిలో చోటుచేసుకుంది. పోలీసుల విద్యార్థులు తెలిపిన వి వరాల ప్రకారం..శంషాబాద్ ప్రాంతానికి చెందిన నాగ రాజు(38) అనే వ్యక్తి ఒక సంవ త్సరం కాలంగా వర్థమాన్ ఇంజ నీరింగ్ కళాశాలలో బస్సు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. రోజు మాది రిగానే బస్సులో విద్యార్థులను తీసుకొని మెహిదీపట్నం నుంచి శంషాబాద్ వెళ్తుండగా శివరాం పల్లి ప్రధాన రహదారిపై వెళ్తుండగా నాగరాజుకు ఒక్క సారిగా గుండెపోటు రావడంతో పక్కకు ఒరిగిపోయాడు. ఇది గమనించిన విద్యార్థులు వెంటనే బస్సు బ్రేకులు వే యడంతో బస్సు ఆగిపోయింది. వెంటనే నాగరాజును స్థా నికంగా ఉన్న శ్రీ చంద్ర ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. విద్యార్థులు సకాలంలో గుర్తించి బస్సు లు బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. వెంట నే కళాశాల యాజమాన్యం నాగరాజు కుటుంబ సభ్యుల కు, పోలీసులకు సమాచారం అందించారు. నాగరాజు మరణం వార్త విన్న వెంటనే ఆస్పత్రికి చేరుకున్న కుటుం బ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోధించారు. నాగరాజు మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మాని యా ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌గా నాగరాజు తన విధులను సక్రమంగా నిర్వహించేవాడని అందరితో కలిసి పోయే నాగరాజు మరణవార్తతో కాలేజీలో విషాదఛాయ లు చోటుచేసుకున్నాయి.