
మండల పరిధిలోని మోడల్ స్కూల్ కళాశాల ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పల్సం భవ్య శ్రీ తండ్రి సత్తయ్య 2024 సంవత్సరం జేఈఈ మెయిన్స్ ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మెయిన్స్ కు అర్హత సాధించిన భవ్యశ్రీని మంగళవారం అధ్యాపక బృందం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జి రాము మాట్లాడుతూ గత సంవత్సరం కూడా మా కళాశాల విద్యార్థులు ఎంసెట్, ఎంబిబిఎస్ ర్యాంకులు సాధించి మంచి పేరు ప్రతిష్టలు తీసుకు వస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని అన్నారు.జేఈఈ మెయిన్స్ తో పాటు నీట్, ఎంబీబీఎస్, ఎంసెట్ తదితర పోటీ పరీక్షలతోపాటు ఏఎన్ఎంఎస్ లో కూడా పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని పేర్కొన్నారు. అధ్యాపక బృందం కూడా రోజువారి క్లాసులతోపాటు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే విధంగా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా భవ్య శ్రీ మాట్లాడుతూ జేఈఈ మెయిన్స్ అర్హత సాధించడం చాలా సంతోషంగా ఉందని సహకరించిన అధ్యాపక బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేష్, అనసూయ ప్రవీణ్ పూర్ణిమ సుస్మిత కనకదుర్గ పృథ్వీరాజ్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.