– ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ దే
– మండలంలో.. మన ఊరిలో పనుల జాతర షురూ
– పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
నవతెలంగాణ – రాయపర్తి
గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనకరమైన ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మరింత పక్కాగా అమలవుతుందని పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరిలో పనుల జాతర కార్యక్రమాన్ని మంగళవారం మండలంలోని రాగన్నగూడెం గ్రామంలో ప్రారంభించారు. 3 లక్షల 9వేల రూపాయలతో ఫామ్ పౌండ్ పనిని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని కొనియాడారు. పేద ప్రజల పక్షాన నిలిచే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని ఉపోద్ఘాటించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఊరిలో పనుల జాతర పనులు విజయవంతంగా అమలవుతాయని హామీ ఇచ్చారు. నియోజకవర్గం ప్రజల కష్టసుఖాల్లో పాల్గొని వారికి అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కిషన్, ఏపీఓ కుమార్ గౌడ్, ఏపీఎం ప్రకాష్, పిఆర్ ఏఈ శ్రీప్రియ, ఈఎంసీ వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హమ్య నాయక్, మండల అధ్యక్షుడు ఈదులకంటిరవీందర్ రెడ్డి, మండల నాయకులు రెంటాల గోవర్ధన్ రెడ్డి, మాచర్ల ప్రభాకర్, మహేందర్ రెడ్డి, ఉస్మాన్, ఆఫ్రోస్ ఖాన్, మహమూద్, గౌస్ ఖాన్, కోతి కళ్యాణ్, పిరని ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.