సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా విదేశాల్లో ఉంటూ నిర్మాతగా, ఫైనాన్షియర్‌గా సినిమాల మీద తనకున్న ప్యాషన్‌ని చాటుకుంటున్నారు శింగనమల కల్యాణ్. తన సినీ వ్యాలీ మూవీస్‌లో ఈ ఏడాది ‘భాగ్ సాలే’ సినిమాను నిర్మించిన ఆయన దాము రెడ్డితో కలసి గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్ పార్టనర్ షిప్‌లో ప్రొడ్యూస్ చేస్తున్న కొత్త సినిమా ‘రాక్షస కావ్యం’. అభరు నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి దర్శకుడు శ్రీమాన్ కీర్తి. ఈనెల 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి నిర్మాత శింగనమల కళ్యాణ్ మాట్లాడుతూ, ‘తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఉండే రా అండ్ రస్టిక్ మూవీ ఇది. చాలా సహజంగా ఉంటుంది. ముఖ్యంగా దిగువ మధ్య తరగతికి చెందిన మనుషులు, బస్తీల్లో ఉండేవాళ్ల మైండ్ సెట్, జీవన విధానం మూవీలో కనిపిస్తుంది. కథను బాగా తెరకెక్కించాడు దర్శకుడు శ్రీమాన్. ప్రస్తుతం టాంగా ప్రొడక్షన్స్ అధినేత విజరు మట్టపల్లి భాగస్వామ్యంతో మా సంస్థ నిర్మిస్తున్న ‘ప్రేమ కథ’ అనే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి దశలో ఉంది. మరో మూవీ కూడా క్రిస్మస్‌కు లేదా జనవరిలో రిలీజ్ చేస్తాం. మా సంస్థలో సంజీవ్ రెడ్డి డైరెక్షన్‌లో చైతన్య రావ్ హీరోగా ఓ కొత్త సినిమా ఉంటుంది. అలాగే భవిష్యత్‌లో స్టార్ హీరోలతోనూ సినిమాలను మా సంస్థ నిర్మించనుంది’ అని తెలిపారు.
ఈ కథలో విలన్స్ గెలవాలి.
ఎప్పుడూ హీరోలే ఎందుకు గెలవాలి అనే కామెడీ పాయింట్ కూడా కొత్తగా ఉంటుంది. ఇవాళ నెగటివ్ క్యారెక్టర్స్‌ను ప్రేక్షకులు బాగా ఇష్టపడు తున్నారు. అందుకు ‘పుష్ప, కేజీఎఫ్’ లాంటి సినిమాల సక్సెస్ నిదర్శనం. అలాంటి ట్రెండ్ ఇప్పుడు నడుస్తోంది. అందుకే మా ట్రైలర్ రిలీజ్‌లో దిల్ రాజు చెప్పింది వంద శాతం కరెక్ట్.