– వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్య
నవతెలంగాణ – చండూరు
మోడీ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్య పిలుపునిచ్చారు. మంగళవారం గట్టుప్పల్ మండల కేంద్రంలోజరిగిన వ్యవసాయ కార్మిక సంఘం చేతివృత్తుదారుల సమస్యలపై మండల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి చేనేత వృత్తులు కోనరిల్లాయని ప్రభుత్వ విధానాల ఫలితంగా వృత్తులు దెబ్బతిని ఉపాధిని కోల్పోయిన చేతివృత్తదారులను వీధిన పడేసిన దుస్థితి భారతదేశ వ్యాప్తంగా ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు పోరాటాల ఫలితంగా వచ్చిన ఉపాధి ఏమి చట్టాన్నికి కేంద్రంలో నిధులు తగ్గిస్తూ ఉపాధి హామీ చట్టాన్ని నేరుగారిస్తుందని క్రింద ప్రభుత్వ కుదింపు మూలంగా వ్యవసాయ పేదలు చట్టానికి దూరం అవుతున్నారని తెలిపారు. 5కోట్ల 80 లక్షల మంది లబ్ధిదారులు, రెండు కోట్ల రేషన్ కార్డుల రద్దు అన్యాయం. ఆకలి చావుల పెంపుకే ఆధార్ ప్రామాణికం రాజ్యాంగ , ఉల్లంగనేనని తెలిపారు. ఉపాధి నిధుల తగ్గింపు మరింత పేదరికం పెంచడానికి పెద్దలకు రాయితీలు పేదలకు మొండి చేయి చూపడమేనని. బిజెపి ప్రభుత్వం కేంద్రంలో, మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలను కొట్టి పెద్దలకు పెట్టే విధానాలను మరింత పెంచిందనీ, ప్రజా వ్యతిరేక విధానాలను శరవేగంగా అమలు జరుపు తుందని ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చేతివృత్తుదారుల సంఘం రాష్ట్ర నాయకులు బండా శ్రీశైలం మాట్లాడుతూ.. వృత్తి రక్షణకై వృత్తిదారులు ఉద్యమించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన వృత్తిదారుల బ్రతుకులు నాశనం చేసే పద్ధతుల్లో ఉందని విమర్శించారు.
5 కోట్ల 80 లక్షల మంది ఇపుడు రేషన్ కార్డులు కలిగిన లబ్ధిదారులను రెండు కోట్ల రేషన్ కార్డ్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈది పచ్చి దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల మంది వలసలు వెళ్తున్న తరుణంలో వాటిని ప్రభుత్వం పట్టించుకోకుండా రద్దు చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధార్ ప్రామాణికంగా తీసుకోవద్దని స్వయాన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సైతం బిజెపి అమలు జరపలేదని, రాజ్యాంగ ఉల్లనకు పాల్పడుతుందని వారు విమర్శించారు. పేదలకు ఉపయోగపడే సంక్షేమ పదాలకు పథకాలకు ప్రామాణికంగా ఉన్న రేషన్ కార్డును తీసివేయడం అంటే పేదరికాన్ని, దారిద్యాన్ని పెంచే విధానాలు కావా అని వారు ప్రశ్నించారు. దీనివలన ఆకలి బాధలు, ఆత్మహత్యలు పెరుగుతాయని పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తామని చెప్పిన బిజెపి పేదలను నిర్మూలించే విధానాలను అమలు జరుపుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే జాతీయ గ్రామీణ ఉపాధి లో 6 కోట్ల మంది ఉపాధి కార్డు లు రద్దు చేశారు. హామీ చట్టం ప్రకారం పని అడిగిన వారికి అందరికీ ఇవ్వాలని చట్టం చెపుతుంటే ఉపాధి నిధులు తగ్గించడం, ఆరు కోట్ల ఉపాధికార్డులు రద్దుచేసి నిధులు తగ్గించేటటువంటి పని బిజెపి ప్రభుత్వం చేస్తుందని, అంటే పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా చేయడమేనని అన్నారు. గత రెండు సంవత్సరాలలోఆహారj భద్రత కు కేంద్ర బడ్జెట్ లో నిధులు భారీ మొత్తంలో తగ్గిస్తున్నారు.2.70 లక్షల కోట్ల నుండి 2 లక్ష కోట్లకు అంటే 70 వేల కోట్లు ఇపుడు ఆహార భద్రత కు ఈ సంవత్సరం బడ్జెట్ కోత విధించారని వారు అన్నారు. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు తెలియజేస్తూ ఫుడ్ కూపన్స్ పేరుతో నగదు బదిలీ తీసుకురావడానికి యోచిస్తున్నట్లుగా తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యకాస మండల కార్యదర్శి కర్నాటి సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకులు కర్నాటి మల్లేశం, చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ మునుగోడు నియోజకవర్గం అధ్యక్షులు కర్నాటి వెంకటేశం, సిఐటియు నాయకులు కే నగేష్, గీత సంఘం నాయకులు పెదగాని నరసింహ, రైతు సంఘం మండల నాయకులు అచ్చిన శ్రీనివాస్, వృత్తి సంఘాల నాయకులు, అచ్చిన బీరప్ప జేరుపోతుల ధనంజయ గౌడ్,వల్లూరు శ్రీశైలం, రబ్బాని, చంద్రయ్య, టేకుమట్ల కృష్ణయ్య,తదితరులు పాల్గొన్నారు.