ఆమని, వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డి, ప్రగతి, కేదార్ శంకర్, ప్రమోదినీ తదితరులు కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘నారి’. మహిళల్ని గౌరవించాలి, ఆడపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి అనే కాన్సెప్ట్‌తో దర్శకుడు సూర్య వంటిపల్లి దర్శకత్వంలో శశి వంటిపల్లి నిర్మించారు.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 25న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క ఈ సినిమా టైటిల్ పోస్టర్, గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ‘మహిళలు ఎన్నో రంగాల్లో ఎదుగుతున్నారు. అయినా వారి పట్ల వివక్ష, చిన్నచూపు తగ్గడం లేదు. సమాజ నిర్మాతలు మహిళలే అనే నిజాన్ని మనమంతా గుర్తుపెట్టుకోవాలి. ఆడ పిల్లలు ఎదిగేం దుకు ప్రతి ఒక్కరు తోడ్పాటు అందించాలి. మహిళల్ని గౌరవిం చాలి. ఇలాంటి గొప్ప కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేసిన సూర్య వంటిపల్లికి అభినందనలు. ఈ సినిమా పోస్టర్, గ్లింప్స్ నా చేతుల మీదుగా విడుదల చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలి’ అని తెలిపారు.
ఛత్రపతి శేఖర్, నాగ మహేశ్, సునైన, రామచంద్ర, రాజశేఖర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి డీవోపీ – వి రవికుమార్, భీమ్ సాంబ, ఎగ్జిక్యూటివ్ డీవోపీ – కష్ణ, మ్యూజిక్ – వినోద్ కుమార్, లిరిక్స్ – భాస్కరభట్ల, ప్రసాద్ సాన, సింగర్స్ – రమణ గోగుల, ఆర్పీ పట్నాయక్, చిన్మయి శ్రీపాద, సి.షోర్, ఎడిటర్
– మాధవ్ కుమార్ గుల్లపల్లి.
ఇటీవల ఓ అమ్మాయి తన టీచర్‌తో అమ్మాయిగా తన కష్టాలు చెబుతూ, తాను మగవాడిగా మారాలని అనుకుంటున్నట్లు చెప్పిన వీడియో ఒకటి బాగా వైరల్ అయ్యింది. ఆ సన్నివేశం మా ‘నారి’ సినిమాలోనిది. ఆ అమ్మాయి పేరు నిత్యశ్రీ. మహిళల పట్ల మనం ఎలా వ్యవహరించాలి?,
వారికి ఎలా సపోర్ట్ చేయాలనే మంచి కాన్సెప్ట్‌తో
ఈ సినిమాను రూపొందించాను. ప్రతి మహిళ తమ ఇంట్లోని పురుషులను వెంట తీసుకెళ్లి ఈ సినిమాను చూపిస్తారని కోరుకుంటున్నా.
– దర్శకుడు సూర్య వంటిపల్లి