ఇండియన్ లెజెండ్రీ క్రికెటర్ ఎం.ఎస్.ధోని ‘ఎల్‌జీఎం’తో చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఇందులో హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లిమిటెడ్ బ్యానర్‌పై సాక్షి ధోని, వికాస్ హస్జా నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 4న ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో జె.పి.ఆర్.ఫిల్మ్స్, త్రిపుర ప్రొడక్షన్స్ బ్యానర్స్ విడుదల చేస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో నదియా మాట్లాడుతూ, ‘ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలను మీరెలా ఎంజారు చేశారో, అలాగే ఈ సినిమాను కూడా ఎంజారు చేస్తారని భావిస్తున్నాను’ అని తెలిపారు. ‘ఈ చిత్ర ట్రైలర్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ధోని క్రికెట్‌లో ఎలాంటి విజయాలను సాధించారో అలాంటి సక్సెస్‌ను సినిమా రంగంలోనూ సాధించాలని కోరుకుంటున్నాను’ అని హీరో సుధీర్ బాబు చెప్పారు. సాక్షి ధోని మాట్లాడుతూ, ‘ఈ సినిమాను తమిళంలో చేసినా, తెలుగులో ధోనికి భారీ సంఖ్యలో అభిమాను లున్నారు. అందువల్ల తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాం. ఇదొక ఇండిపెండెంట్‌గా ఉండే అమ్మాయి కథ. మన లైఫ్‌లో రిలేషన్ షిప్స్ గురించి చెప్పే సినిమా ఇది’ అని అన్నారు.