డబ్బుని ఇష్టపడే ప్రతి ఒక్కరికీ నచ్చే సినిమా

A movie for everyone who loves moneyహీరో సత్య దేవ్‌, కన్నడ స్టార్‌ డాలీ ధనంజయ మోస్ట్‌ ఎవైటెడ్‌ మల్టీ-స్టారర్‌ ‘జీబ్రా’. ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకుడు. పద్మజ ఫిలింస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఓల్డ్‌ టౌన్‌ పిక్చర్స్‌ బ్యానర్లపై ఎస్‌ఎన్‌ రెడ్డి, ఎస్‌.పద్మజ, బాల సుందరం, దినేష్‌ సుందరం నిర్మిస్తున్నారు. తాజాగా హీరో నాని ఈ సినిమా టీజర్‌ను లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా మనోజ్‌ మంచు మాట్లాడుతూ, ‘టీజర్‌ అదిరి పోయింది. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘డైరెక్టర్‌ ఈశ్వర్‌ కార్తిక్‌ చెప్పిన కథ అదిరిపోయింది. ఇందులో చాలా కొత్త క్యారెక్టర్‌తో రాబోతున్నాను. ట్రూ నేషనల్‌ ఫిల్మ్‌ ఇది. అన్ని చిత్ర పరిశ్రమల్లోని ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఇందులో పని చేశారు. ధన, నా కెరీర్‌లో ఇది మైల్‌ స్టోన్‌ ఫిల్మ్‌. డబ్బు అంటే ఇష్టం ఉన్న ప్రతి వ్యక్తికి ఈ సినిమా నచ్చుతుంది. వైట్‌, బ్లాక్‌ మనీతో పాటు చాలా ఎలిమెంట్స్‌ మిమ్మల్ని అలరిస్తాయి’ అని హీరో సత్యదేవ్‌ చెప్పారు. హీరో డాలీ ధనంజయ మాట్లాడుతూ, ‘సత్యదేవ్‌ ఈ కథ వినమని కాల్‌ చేశారు. ఈశ్వర్‌ మైసూర్‌ వచ్చి ఈ కథ చెప్పారు. చాలా నచ్చింది. ప్రేక్షకులు చాలా మంచి సినిమా చూడబోతున్నారు’ అని తెలిపారు. ‘అందరి సహకారంతో సినిమా చాలా బాగా వచ్చింది’ అని దర్శక, నిర్మాతలు అన్నారు.