మనలోని ప్రశ్నలకు సమాధానమిచ్చే సినిమా

A movie that answers our questions‘మా అన్నయ్య సూర్య నా మొదటి సినిమా చూసి నన్ను హగ్‌ చేేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ‘సత్యం సుందరం’ చూసి చాలా ప్రౌడ్‌గా హగ్‌ చేసుకున్నారు. అద్భుతంగా పెర్ఫార్మ్‌ చేశానని కాంప్లిమెంట్‌ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది’ అని హీరో కార్తీ చెప్పారు. కార్తీ, అరవింద్‌ స్వామి లీడ్‌రోల్స్‌లో రాబోతున్న చిత్రం ‘సత్యం సుందరం’. ’96’ ఫేమ్‌ సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మించారు. ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. ఈనెల 28న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరో కార్తీ మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు. ’96’ సినిమా తర్వాత డైరెక్టర్‌ ప్రేమ్‌ కుమార్‌  చేస్తున్న సినిమా ఇది. ఈ స్క్రిప్ట్‌ని ఆయన ఒక అద్భుతమైన నవలగా రాశారు. చదువుతున్నప్పుడు చాలా చోట్ల ఆనందంలో కన్నీళ్ళు వచ్చాయి. నాకు కె.విశ్వనాథ్‌ సినిమాలు ఇష్టం.  ‘సాగర సంగమం’ సినిమా చూసినప్పుడు ఎలాంటి ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుందో ఈ సినిమా కూడా అలాంటి ఓ మంచి అనుభూతిని అందిస్తుంది. మనలోని చాలా  శ్నలకు సమాధానం ఇచ్చే కథ ఇది. నేను, అరవింద్‌ స్వామి.. మా ఇద్దరిలో ఎవరు లేకపోయినా ఈ సినిమా లేదు. ఇలాంటి కథ అరవింద్‌ స్వామి నిజ జీవితంలో జరిగిందని తెలిసి  లా సర్‌ప్రైజ్‌ అయ్యాను. బ్రదర్స్‌ లాంటి రెండు క్యారెక్టర్స్‌ మధ్య నడిచే కథ ఇది. ’96’లానే ఇది ఒక్క నైట్‌లో జరిగే కథ. ఫ్యామిలీ ప్రేక్షకులకు కొత్త ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది. ఒక  న్నపల్లెటూరిలో శారీ షాప్‌ నడిపే ఇన్నోసెంట్‌ క్యారెక్టర్‌ నాది. తనకి లైఫ్‌ మీద ఎలాంటి అంచనాలు ఉండవు. చాలా చలాకీగా మాట్లాడే క్యారెక్టర్‌ దీంతోపాటు ఇందులో ఉన్న అన్‌  డీషనల్‌ లవ్‌, మన కల్చర్‌, రూట్స్‌కి సంబంధించిన స్టొరీ. ఇది నాకు చాలా బాగా నచ్చింది.