అందరికీ కనెక్ట్‌ అయ్యే సినిమా

అందరికీ కనెక్ట్‌ అయ్యే సినిమాసందీప్‌ కిషన్‌ నటించిన ఫాంటసీ అడ్వెంచర్‌ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. విఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కావ్య థాపర్‌, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్‌ దండా నిర్మించారు.
ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్‌ సుంకర సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. ఈ చిత్రం ఈనెల 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు విఐ ఆనంద్‌ ఈ చిత్ర విశేషాలని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.
సందీప్‌ ‘ఊరు పేరు భైరవకోన’ కథకు చాలా ఎగ్జైట్‌ అయ్యారు. నాకు కూడా ఈ కథ చేస్తే చాలా కొత్త ఉంటుంది. ఒక ట్రెండ్‌ సెట్‌ చేసేలా ఉంటుదని ఫిక్స్‌ చేశాం. ఇప్పటివరకూ సందీప్‌ కూడా సూపర్‌ నేచురల్‌ ఫాంటసీ జోనర్‌ చేయలేదు. ఆయనకి కూడా ఇది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. బిగ్‌ స్క్రీన్‌ పై విజువల్‌, సౌండ్‌ పరంగా ఒక గొప్ప ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే సినిమా ఇది. హాస్య మూవీస్‌లో ప్రొడక్షన్‌ నెం.1 ఈ సినిమా. మా మంచి కోరే వ్యక్తి అనిల్‌ సుంకర. ఆయన ఈ ప్రాజెక్ట్‌లోకి వస్తే బావుంటుందని కోరుకున్నాం. అలా ఆయన జాయిన్‌ అవ్వడంతో ఈసినిమా జర్నీ స్టార్ట్‌ అయ్యింది.
ఈ కథకి ‘ఊరు పేరు భైరవకోన’ యాప్ట్‌ అనిపించి ఫిక్స్‌ చేశాం. టైటిల్‌లో మైథాలజీ టచ్‌ వుంది. ఈ కథలో కూడా కర్మ సిద్ధాంతం, గరుడపురాణం, శివదండం లాంటి నేపధ్యాలు ఉన్నాయి కాబట్టి ఈ టైటిల్‌ సరిగ్గా నప్పుతుంది. కర్మ సిద్ధాంతం నియమంలోనే ఈ కథ ఉంటుంది.
మనం చేసిన కర్మ వేరే విధంగా తిరిగివస్తుంది. స్టొరీ లైన్‌లోనే ఈ ఫిలాసఫీ ఉంది. లైఫ్‌, డెత్‌ గురించి నాకు చాలా ఆసక్తి. చనిపోయిన తర్వాత ఆత్మ ప్రయాణం గరుడపురాణంలో వివరంగా ఉంది. ఈ జర్నీ చాలా ఆసక్తిని కలిగించింది.ఈ సినిమాని ఎక్కడా రాజీపడకుండా చాలా గ్రాండ్‌గా రూపొందించాం. అనిల్‌, రాజేష్‌ కథని చాలా బలంగా నమ్మి కావాల్సిన ప్రతీదీ సమకూర్చారు. ఇది యూత్‌, ఫ్యామిలీతో పాటు అందరికీ కనెక్ట్‌ అయ్యే సినిమా ఇది.
ఇందులో వెన్నెల కిషోర్‌ ట్రాక్‌ భలే వర్క్‌ అవుట్‌ అయ్యింది. డాక్టర్‌ నారప్ప అనే హిలేరియస్‌ క్యారెక్టర్‌ చేశారు. అలాగే వైవా హర్ష పాత్రలో కూడా ఫన్‌ ఎలిమెంట్‌ బాగా వచ్చింది. కావ్య థాపర్‌ పాత్రలో కూడా చాలా ఫన్నీగా ఇంట్రెస్టింగ్‌ ఉంది. ఆడియన్స్‌ ఖచ్చితంగా ఎంజారు చేస్తారు. సినిమా ఫన్‌ రైడ్‌లా ఉంటుంది.
అలాగే ఇందులో రెండు పెద్ద ట్విస్ట్‌లు ఉన్నాయి. వీటితో పాటు చిన్న చిన్న ట్విస్ట్‌లు కూడా అంటే ప్రతి పదినిమిషాలకు ప్రేక్షకులు ఊహించని మలుపులు చోటు చేసుకుంటాయి. స్క్రీన్‌ ప్లే చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. థియేటర్‌లో ఎంజారు చేసి చూసే సినిమా ఇది. సందీప్‌లో ఫైర్‌, ప్యాషన్‌ బాగా ఉంది. ప్రతి సినిమాని మొదటి సినిమాలా నమ్మి పని చేస్తున్నారు. నటన పరంగా చాలా పరిణతి సాధించారు.
ఈ సినిమా కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. నిఖిల్‌ తో ఓ సినిమా చర్చల్లో ఉంది. దీంతోపాటు అలాగే ఓ పెద్ద హీరోకి కథ రాస్తున్నాను. వాటి వివరాలు త్వరలోనే తెలియజేస్తాను.